ఎదురయే ప్రతి మలుపు
ఓ కూడలే అయితే
ఎటువైపెళితే ఏముందో తెలియని
ప్రవల్లిక అయితే
ఏమి చేయను?
అందుకే
నిరంతరం సాగే ప్రస్థానం
అలవాటైన దారిలోనే పయనం
ముళ్ళు తెలుసు, రాళ్ళు తెలుసు,
వాటిని తప్పించుకుంటూ
అడుగేయడం తెలుసు
ముందు నుయ్యి, వెనుక గొయ్యి
నాకెంత మాత్రం చిక్కు సమస్య కాదు
వెనుక గొయ్యికే నా ప్రాధాన్యం
చచ్చే వరకు ఊపిరి తీసుకోవచ్చు
నూతిలో ఆ అవకాశం కూడా కరువే!!
Advertisement
Filed under: Uncategorized