దీని నోటికి నేనెప్పుడు
తాళం వేసే ఉంచుతాను!
అది మాట్లాడుతూ ఉంటే
నన్ను బతకనివ్వదని!
కానీ అప్పుడప్పుడు
దాని మాటలు నాకు వినాలనిపిస్తుంది.
నా ఊసులు పంచుకోవాలనిపిస్తుంది.
మది గది తలుపులు
తీయడం ఆలస్యం
తుర్రుమంటుంది.
నాకు దొరకకుండా పారిపోతుంది.
నీ మాట నేను వినను
నా మాటే నువ్వు విను అంటుంది.
ఇప్పుడది కూడా నా పక్షం కాదు!!
Advertisement
Filed under: Uncategorized