ప్రయాణం

ఎదురయే ప్రతి మలుపు ఓ కూడలే అయితే ఎటువైపెళితే ఏముందో తెలియని ప్రవల్లిక అయితే ఏమి చేయను? అందుకే నిరంతరం సాగే ప్రస్థానం అలవాటైన దారిలోనే పయనం ముళ్ళు తెలుసు, రాళ్ళు తెలుసు, వాటిని తప్పించుకుంటూ అడుగేయడం తెలుసు ముందు నుయ్యి, వెనుక గొయ్యి నాకెంత మాత్రం చిక్కు సమస్య కాదు వెనుక గొయ్యికే నా ప్రాధాన్యం చచ్చే వరకు ఊపిరి తీసుకోవచ్చు నూతిలో ఆ అవకాశం కూడా కరువే!!

ప్రేమైక ఆనందం

ప్రేమలో పడ్డవారికి ప్రపంచమంతా ప్రేయసి/ప్రియుడి గానే కనిపిస్తుంది అని విన్నా! నిర్వచించలేని అనుభూతి అని నమ్మా! అందుకే నేను కూడా ప్రేమించడం మొదలుపెట్టా ఆనందాన్ని! ఇప్పుడు నా ప్రపంచమంతా ఆనందమే!!

నా మనసు

దీని నోటికి నేనెప్పుడు తాళం వేసే ఉంచుతాను! అది మాట్లాడుతూ ఉంటే నన్ను బతకనివ్వదని! కానీ అప్పుడప్పుడు దాని మాటలు నాకు వినాలనిపిస్తుంది. నా ఊసులు పంచుకోవాలనిపిస్తుంది. మది గది తలుపులు తీయడం ఆలస్యం తుర్రుమంటుంది. నాకు దొరకకుండా పారిపోతుంది. నీ మాట నేను వినను నా మాటే నువ్వు విను అంటుంది. ఇప్పుడది కూడా నా పక్షం కాదు!!

Follow

Get every new post delivered to your Inbox.